Telangana EAPCET : విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ EAPCET, పీజీ ఈసెట్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు..
ఈసారి ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తోంది.

Telangana EAPCET : తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
సంబంధిత నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20న ప్రచురించనున్నట్లు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ , EAPCET కన్వీనర్ బి. డీన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 25 (మంగళవారం) నుండి ఏప్రిల్ 4 వరకు, ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. శ్రీ కుమార్ కమిటీ చర్చల ప్రకారం.. “TG EAPCET 2025 సిలబస్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ నుంచి ఉంటుందన్నారు.
పీజీ ఈసెట్ షెడ్యూల్ ఇదే..
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తోంది.
Also Read : ఇండియన్ మార్కెట్‌లో చైనీస్ ఫోన్ హవా.. ఐఫోన్, సాంసంగ్‌ని తొక్కుకుంటూ పోతుంది..
ఫిబ్రవరి 3 (సోమవారం) జరిగిన PGECET కమిటీ సమావేశం ప్రకారం.. PGECET జూన్ 16 నుండి 19 వరకు (సోమవారం నుండి గురువారం వరకు) నిర్వహించబడుతుందని JNTUH పరీక్ష కన్వీనర్ అరుణ కుమారి తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 17 (సోమవారం) నుండి ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మే 19.
నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించనున్న ICET (MBA, MCA కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) షెడ్యూల్‌ను కూడా MGU వైస్-ఛాన్సలర్, ICET కన్వీనర్ రవి పరీక్ష కమిటీ సమావేశంలో విడుదల చేశారు.