అంతర్జాతీయ స్థాయిలో విద్య.. తెలంగాణ ప్రభుత్వ యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో ఇలా చేరొచ్చు..

ఈ యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో ఫీజులు రీజనబుల్‌గా ఉంటాయి.

అంతర్జాతీయ స్థాయిలో విద్య.. తెలంగాణ ప్రభుత్వ యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో ఇలా చేరొచ్చు..

Updated On : April 10, 2025 / 10:42 AM IST

రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ నిర్మించారు. ఈ స్కూల్‌లో 50% ప్రవేశాలు పోలీసుల పిల్లలకు ఉంటుంది. మిగిలిన సీట్లను ఇతర పిల్లలకు ఇస్తారు. ఇందులో ఫీజులు పోలీసుల ర్యాంకుల ఆధారంగా ఉంటుంది.

ఓపెన్‌ కేటగిరీ విధానంలో సీట్లు అందుబాటులో ఉంటాయి. 1 నుంచి 5 తరగతుల్లో అడ్మిషన్ల కోసం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (వైఐపీఎస్‌) వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి క్లాసులో 40 సీట్లు ఉంటాయి. 5 తరగతుల్లో కలిపి మొత్తం 200 సీట్లు ఉంటాయి.

అందులో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు ఉంటాయి. మిగతావి ఇతర పిల్లలకు కేటాయించారు. ఈ యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను తెలంగాణ సర్కారు సైనిక్ స్కూల్స్ తరహాలో తీసుకొచ్చింది.

ఈ యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో ఫీజులు రీజనబుల్‌గా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య, సీబీఎస్‌సీ సిలబస్ ఉంటాయి. క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్‌లో ఉంది.

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు

  • పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ yipschool.in ఓపెన్‌ చేయాలి
  • వెబ్‌సైట్‌లో ‘అడ్మిషన్స్’ విభాగానికి వెళ్లి క్లిక్ చేయండి
  • విద్యార్థి మొదటి పేరు
  • విద్యార్థి చివరి పేరు
  • తల్లిదండ్రుల మొదటి పేరు
  • తల్లిదండ్రుల చివరి పేరు
  • 1 నుంచి 5వ తరగతిలో ఏ క్లాస్‌లో చేరతారో టైప్‌ చేయండి
  • పోలీస్ కుటుంబాలు లేదా నాన్ పోలీస్ కుటుంబాల్లో మీ ఆప్షన్ ఎంచుకోండి
  • చిరునామా ఇవ్వండి
  • ఈమెయిల్ ఐడీ ఇవ్వండి
  • ఫోన్ నంబర్ టైప్ చేయండి
  • సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి