TG ICET 2025 Results: టీజీ ఐసెట్ 2025 రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలు ఇలా తెలుసుకోండి
TG ICET 2025 Results: తెలంగాణలో ఐసెట్ ఫలితాలు 2025(TG ICET-2025 Results) విడుదలయ్యాయి.

TS ICET 2025 Results out now
తెలంగాణలో ఐసెట్ ఫలితాలు 2025(TG ICET-2025 Results) విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. పరీక్షా రాసిన విద్యార్థులు icet.tgche.ac.in నుంచి తమ రిజల్ట్ చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐసెట్ రిజల్ట్ ఇలా తెలుసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in లోకి వెళ్ళాలి.
- అక్కడ TS ICET result/marks memo download link అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఫలితాన్ని స్క్రీన్ పై డిస్ప్లే అవుతాయి.
- వాటిని సేవ్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.