TG ICET 2025 Results: రేపే తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలు.. ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TG ICET 2025 Results: ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూలై 7వ విడుదల కానున్నాయి.

Telangana ICET 2025 Results
ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూలై 7వ విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఓ అధికారిక ప్రకటన చేశారు. జులై 7 మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఫలితాలు అందుబాటులోకి వస్తాయని, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.in ద్వారా ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు సూచించారు.
ఐసెట్ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో టీజీ ఐసెట్ రిజల్ట్స్ 2025 అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్ తోపాటు మరిన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ చేసుకోవాలి.