15 తర్వాతే TS INTER రిజల్ట్స్!

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 02:16 AM IST
15 తర్వాతే TS INTER రిజల్ట్స్!

Updated On : April 13, 2019 / 2:16 AM IST

తెలంగాణ రాష్ట్రంలో INTER రిజల్ట్స్ ఏప్రిల్ 15 తర్వాతే రిలీజ్ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తున్నాయి. ఇప్పటికే APలో ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నా..ఏమాత్రం పొరపాటు రావొద్దని మరోసారి సరి చూసుకుంటున్నారు అధికారులు. తప్పులు లేకుండా విడుదల చేయడం బెటర్ అని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ భావిస్తున్నారు.

ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఇంటర్ బోర్డుకు వచ్చి ఫలితాల సరళిని పరిశీలించి వెళ్లారు. ఎలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు JNTUH పరీక్షల విభాగం అధికారి ఆచార్య కామాక్షి ప్రసాద్ సలహాలు ఇంటర్ బోర్డు అధికారులు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13 శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం రోజుల్లో సరి చూసుకుని..ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు జరిగాయి. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఈ రెండు పరీక్షలకు మొత్తం 9.63 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.