TET 2025: టెట్‌ 2025 దరఖాస్తుల స్వీకరణ షురూ.. ఇలా అప్లై చేసుకోండి..

TGTET అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ఓపెన్ చేయండి.

TET 2025: టెట్‌ 2025 దరఖాస్తుల స్వీకరణ షురూ.. ఇలా అప్లై చేసుకోండి..

Updated On : April 15, 2025 / 2:04 PM IST

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) 2025 దరఖాస్తులను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. టెట్ తొలి విడత నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 11న విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని చెప్పింది.

ఈ మేరకు తొలి విడతకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. పరీక్షలు జూన్‌లో ఆన్‌లైన్‌లో ఉండనున్నాయి. ఎస్‌జీటీ జాబ్స్‌కు అర్హత సాధించేందుకు పేపర్‌-1 నిర్వహిస్తారు. అలాగే ఎస్‌ఏ ఉద్యోగాల అర్హత కోసం పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది.

ఒక పేపర్‌కు అప్లై చేసుకుంటే రూ.750, రెండు పేపర్లకు అప్లై చేసుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 30. హాల్‌టికెట్లను జూన్‌ 9 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ పరీక్షలను జూన్‌ 15-30 మధ్య నిర్వహిస్తారు. ఫలితాలను జులై 22న వెల్లడిస్తారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దాదాపు 2 లక్షల మంది పోటీపడనున్నారు. గత జనవరిలో నిర్వహించిన 2024 టెట్‌-2 పరీక్షకు 2,05,278 మంది హాజరయ్యారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • TGTET అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ఓపెన్ చేయండి
  • హోమ్‌పేజీలో TGTET 2025 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
  • సైన్ అప్ చేయండి
  • అడిగిన సమాచారంతో ఫామ్‌ను నింపండి
  • దరఖాస్తు ఫీజు చెల్లించండి
  • ఫామ్‌ను సమర్పించండి
  • రసీదు ఫామ్‌ను సేవ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి