తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈ నెల 15 నుంచి దరఖాస్తులు

నోటిఫికేషన్‌ పూర్తి సమాచారాన్ని ఈ నెల 15 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈ నెల 15 నుంచి దరఖాస్తులు

Updated On : April 11, 2025 / 7:03 PM IST

తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 30 వరకు టెట్‌ నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌ పూర్తి సమాచారాన్ని ఈ నెల 15 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. కంప్యూటర్ బేస్డ్ గా టెస్ట్ నిర్వహించనుంది విద్యా శాఖ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది 3వ టెట్ నోఫికేషన్.

Also Read: అందుకే నేను మ్యాచ్ తర్వాత “కాంతార”లా ఇలా చేశాను: కేఎల్‌ రాహుల్

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్‌) 2025ను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల మధ్య టీచర్లను నియమించడానికి నిర్వహిస్తారు.

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని చాలా మంది నిరుద్యోగులు కలలు కంటుంటారు. ఆ వృత్తిలో ఉండే జీతాలు, సెలవులు ఇందుకు ఓ కారణం. ఉపాధ్యాయ వృత్తిపై ఎంతో మమకారం ఉండే వారూ ఉంటారు. ఈ జాబ్‌ వచ్చే వరకు పరీక్షలు రాస్తూనే ఉంటారు.