KL Rahul Video: అందుకే నేను మ్యాచ్ తర్వాత “కాంతార”లా ఇలా చేశాను: కేఎల్‌ రాహుల్

కాంతార సినిమాలో హీరో ఓ పోరాట సన్నివేశంలో కత్తిని భూమిపై పెట్టి తిప్పుతాడు.

KL Rahul Video: అందుకే నేను మ్యాచ్ తర్వాత “కాంతార”లా ఇలా చేశాను: కేఎల్‌ రాహుల్

PIC: @BCCI

Updated On : April 11, 2025 / 5:46 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచులో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కేఎల్‌ రాహుల్ 93 పరుగులతో అజేయంగా నిలిచాడు.

జట్టుని గెలిపించిన అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 17.5వ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడానికి కేవలం ఒక పరుగు అవసరం ఉన్న సమయంలో యశ్ డేల్ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్ ఫైన్ లెగ్ పై స్కూప్ షాట్‌ ఆడాడు. అది సిక్స్‌ వెళ్లింది.

దీంతో ఢిల్లీ స్కోరు 169గా నమోదైంది. అంతకుముందు ఆర్సీబీ 163 పరుగులు చేసింది. ఢిల్లీ 164 లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్ యొక్క 93 పరుగులను 53 బంతుల్లో చేశాడు. అందులో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మైదానంలో చేసుకున్న సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాంతార సినిమాలో హీరో ఓ పోరాట సన్నివేశంలో కత్తిని భూమిపై పెట్టి తిప్పుతాడు. కేఎల్ రాహుల్ కూడా మ్యాచ్ జరిగాక అలాగే వంగి బ్యాటును భూమిపై పెట్టాడు.

మ్యాచ్ తరువాత కేఎల్ రాహుల్ దీనిపై మాట్లాడుతూ.. ఇది తనకు ప్రత్యేకమైన మైదానమని అన్నాడు. తాను ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం.. నా ఫేవరెట్‌ మూవీల్లో ఒకటైన కాంతార అని, ఆ సినిమా సీన్‌లాగే ఇలా చేశానని తెలిపాడు.