Southern Railway : దక్షిణ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి సమీపిస్తున్న దరఖాస్తు గడువు

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఆయా పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌నిలో అనుభ‌వం క‌లిగి ఉండాలి.

Southern Railway : దక్షిణ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి సమీపిస్తున్న దరఖాస్తు గడువు

Southern Railway

Updated On : August 24, 2023 / 2:57 PM IST

దక్షిణ రైల్వేలోని పలు విభాగాలలో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) ఈ నోటిఫికేషన్ ప్రకారం 790 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డీజిల్, సిగ్న‌ల్, వెల్డ‌ర్, కార్పెంట‌ర్, మాస‌న్ ప్లంబ‌ర్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఆయా పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ప‌నిలో అనుభ‌వం క‌లిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్ధుల వయస్సు 42 సంవత్సరాల లోపు ఉండాలి.

READ ALSO : Sweet Potato Cultivation : ఖరీఫ్ పంటగా చిలగడదుంప సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా ఆగస్టు 30గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sr.indianrailways.gov.in/ పరిశీలించగలరు.