Agniveer Vayu Recruitment: బిగ్ అలర్ట్.. అగ్నివీర్ వాయు పోస్టుల దరఖాస్తుకు రేపటికే లాస్ట్ డేట్.. డైరెక్ట్ లింక్ తో వెంటనే అప్లై చేసుకోండి

Agniveer Vayu Recruitment: దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 4తో అంటే రేపటితో ముగియనుంది.

The application process for Agniveer Air Force posts will end tomorrow.

భారత వైమానిక దళం (IAF) అగ్నివీర్ వాయు పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 4తో అంటే రేపటితో ముగియనుంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12వ తరగతి పరీక్షలో గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లంలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాదించాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఐటీ) కనీసం 50% మార్కులతో పాటు, ఇంగ్లీషులో 50% మార్కులను సాదించాలి. నాన్-సైన్స్ వారు 12వ తరగతిలో ఏదైనా స్ట్రీమ్ నుండి 50% మార్కులతో, ఇంగ్లీషులో తప్పకుండా 50% మార్కులను సాధించి ఉండాలి. అలాగే, రెండేళ్ల వృత్తి విద్యా కోర్సును కనీసం 50% మార్కులతో పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 17.5 సంవత్సరాలు నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు అందరూ రూ.550 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:
ఈ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక నాలుగు దశలలో ఎంపిక చేశారు. వాటిలో రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఉంటాయి.