Thousands of Indian Students in Canada Line Up For Waiter Job
Indian Students in Canada : విదేశీ విద్య, ఉద్యోగాలపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. చాలామంది భారతీయ విద్యార్థులు కెనడా వంటి దేశాల్లో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కెనడాలో జాబ్ ఇంటర్వ్యూ కోసం సుమారు 3వేల మంది భారతీయ విద్యార్థులు క్యూలో నిలబడి ఉన్నారంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం కెనడాలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ వెలుపల విద్యార్థులు వరుసలో ఉన్నారు. వెయిటర్, సర్వెంట్ జాబ్ ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు క్యూలో నిలబడి ఉండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఈ వైరల్ వీడియో చదువుల కోసం కెనడాకు వెళ్లాలని కోరుకునే విద్యార్థులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా “బ్రాంప్టన్‌లో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ ప్రకటన తర్వాత వెయిటర్ అండ్ సర్వెంట్ ఉద్యోగాల కోసం 3వేల మంది విద్యార్థులు (ఎక్కువగా భారతీయులు) క్యూలో నిలబడ్డారు. ట్రూడో కెనడాలో భారీ నిరుద్యోగం? ఆందోళనకరంగా మారింది. భారత్ నుంచి కెనడాకు బయలుదేరిన విద్యార్థులు కలలకు తీవ్రమైన ఆత్మపరిశీలన అవసరం” అంటూ వీడియో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ వీడియో ఏ తేదీలో ఏ సమయం అనేది క్లారిటీ లేదు.
మెరిసేదంతా బంగారం కాదంటున్న నెటిజన్లు.. :
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. “ప్రధానంగా భారత్ నుంచి 3వేల మంది విద్యార్థులు బ్రాంప్టన్‌లో వెయిటర్, సర్వెంట్ ఉద్యోగాల కోసం క్యూ కట్టడం ఆందోళనకరంగా ఉంది. ట్రూడో కెనడాలో నిరుద్యోగ పరిస్థితి కనిపిస్తోంది. తమ కలలను నెరవేర్చుకునేందుకు భారత్ నుంచి కెనాడా బయలుదేరే వారు ఇక్కడి వాస్తవాలను తప్పక తెలుసుకోవాలి. ఇది భయంకరమైనది.. కెనడా పెద్దఎత్తున నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది.
Scary scenes from Canada as 3000 students (mostly Indian) line up for waiter & servant job after an advertisement by a new restaurant opening in Brampton.
Massive unemployment in Trudeau’s Canada? Students leaving India for Canada with rosy dreams need serious introspection! pic.twitter.com/fd7Sm3jlfI
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024
భారత్‌లో కూడా కొత్త రెస్టారెంట్లలో ఉద్యోగం కోసం ఇంత సంఖ్యలో యువకులు బారులు తీరడం చూడలేదు” నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక యూజర్ వ్యాఖ్యానిస్తూ.. “నిజంగా బాధకారమే.. ఇందులో ఎక్కువ మంది ఇంజనీర్లు, ఎంబీఏ హోల్డర్లు, ఐటీ ఇంజనీర్లు, కెనడా కలను నెరవేర్చేందుకు ఇక్కడ వచ్చారు. భారత్‌లో నెలకు లక్ష జీతంతో ఉద్యోగాన్ని వదిలి వచ్చారు. ఈ విద్యార్థులు నిరాశతో పాటు కష్టాలు పడుతున్నారు. మెరుస్తున్నది బంగారం కాదని గుర్తించాలి” అంటూ పేర్కొన్నారు.
కెనడా స్టూడెంట్ వీసా పరిమితులు కఠినతరం :
కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్యతో పాటు అంతర్జాతీయ విద్యార్థులను తగ్గించడానికి ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రణాళికను ప్రకటించింది. 2025లో, కొత్త అంతర్జాతీయ విద్యార్థి అధ్యయన అనుమతి 2024 లక్ష్యం ప్రకారం.. 4లక్షల 85వేల నుంచి 10 శాతం తగ్గించింది. మరో మాటలో చెప్పాలంటే.. 2025 కోసం కేవలం 4 లక్షల 37వేల మంది విద్యార్థులకు మాత్రమే స్టడీ పర్మిట్‌లు జారీ అయ్యాయి. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజెన్‌షిప్ కెనడా ద్వారా 2026లో జారీ అయ్యే అధ్యయన అనుమతుల సంఖ్య 2025లో అలాగే ఉంటుందని పేర్కొంది.