Free Job Training: నిరుద్యోగులకు సాఫ్ట్ వేర్ శిక్షణ.. ఉచిత ట్రైనింగ్, జాబ్ ఆఫర్స్.. అద్భుతమైన అవకాశం మీకోసమే.

Free Job Training: ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో వెబ్ డెవలపర్, జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సులు శిక్షణ ఇస్తున్నట్టుగా జిల్లా ఉపాధి అధికారి త్రినాథ్ తెలిపారు.

Free Job Training: నిరుద్యోగులకు సాఫ్ట్ వేర్ శిక్షణ.. ఉచిత ట్రైనింగ్, జాబ్ ఆఫర్స్.. అద్భుతమైన అవకాశం మీకోసమే.

Free sift ware job training in ap

Updated On : July 2, 2025 / 3:23 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కలిపిస్తోంది. అభ్యర్థులు చదివిన విద్యార్హతను బట్టి వివిధ శిక్షణలు ఇచ్చి వివిధ కంపెనీలలో జాబ్స్ అందిస్తోంది. దీనిలో భాగంగానే ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో వెబ్ డెవలపర్, జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సులు శిక్షణ ఇస్తున్నట్టుగా జిల్లా ఉపాధి అధికారి త్రినాథ్ తెలిపారు.

ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి అవకాశాలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన సూచించారు. నిజంగా వెబ్ డెవలపర్స్ ఎటువంటి వర్క్ చేస్తారో ఇక్కడ నేర్పించడం జరుగుతుందని, శిక్షణ అనంతరము ప్రైవేటు రంగము నందు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. కాబట్టి, ఆసక్తి , అర్హత కలిగిన నిరుద్యోగ యువత కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో వివరాలను సమర్పించాలని కోరారు.

ఈ శిక్షణలో అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే: జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్,

వయోపరిమితి: ఈ శిక్షణకు తీసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

విద్యార్హత: ఈ శిక్షణకు తీసుకునే అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, డిప్లొమాలో తప్పకుండా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పూర్తి వివరాల కోసం, మరేదైనా సందేహాల కోసం 7799552201 నంబర్ ను సంప్రదించగలరు.