Inter Results 2025: ఒరిజినల్ మార్క్స్ మెమోలు ఎప్పుడు వస్తాయి?

విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమో కలర్ ప్రింటవుట్‌ను డౌన్‌లోడ్ తీసుకోవచ్చు.

Inter Results 2025: ఒరిజినల్ మార్క్స్ మెమోలు ఎప్పుడు వస్తాయి?

Updated On : April 22, 2025 / 4:39 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో మార్కులను చెక్‌ చేసుకున్నారు. కాలేజీల్లో విద్యార్థులు మార్కుల మెమోలను అందుకోవచ్చు.

కాలేజీ ప్రిన్సిపాల్‌లు తమ కాలేజీ లాగిన్ నుంచి విద్యార్థుల ఆన్‌లైన్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ (షార్ట్ మెమో)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, కాలేజీ మార్కుల రిజిస్టర్‌లను (టాబ్యులేషన్ రిజిస్టర్‌లు) మంగళవారం సాయంత్రం 5 గంల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read: ఇంటర్ పాస్‌ అయ్యారా? ఇక ఈ ఉద్యోగాల్లో చేరొచ్చు..

విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమో కలర్ ప్రింటవుట్‌ను డౌన్‌లోడ్ తీసుకోవచ్చు. బోర్డు వెబ్‌సైట్ tgbie.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. బోర్డు నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ వచ్చేవరకు దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.

మార్కుల మెమోలో ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే ఫలితాలు వచ్చిన పది రోజుల్లోపు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్స్ ద్వారా బోర్డుకు లేదా helpdesk-ietelangana.gov.in కు మెయిల్ ద్వారా తెలియజేయాలి. పది రోజుల తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.

ఒరిజినల్ మార్క్స్ మెమోలు కూడా కొన్ని వారాల్లోనే విద్యార్థులకు అందుతాయి. రీవేరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవి వచ్చే అవకాశం ఉంది. ఒరిజినల్ మార్క్స్ మెమోలను అందించే విషయంలో ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా తేదీని ప్రకటించలేదు. సాధారణంగానైతే ఫలితాలు వచ్చిన కొన్ని వారాల్లోనే అవి విద్యార్థులకు అందుతాయి.