తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఆన్సర్ కీ 2025 ఏ క్షణమైన రిలీజ్ కావొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
TS TET 2025 Answer Key : టెట్ పరీక్షలో సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 27, 2025లోపు (TS TET 2025) ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తవచ్చు.

TS TET 2025 Answer Key
TS TET 2025 Answer Key : తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా (TS TET 2025) సబ్జెక్టుల వారీగా పరీక్ష ఆన్సర్ కీని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రేపు (జనవరి 24న) విడుదల చేయనుంది. ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ అధికారిక అధికారిక వెబ్సైట్ (tgtet2024.aptonline.in)ను సందర్శించవచ్చు.
అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 27, 2025లోపు (TS TET 2025) ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, అభ్యంతర రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా, అధికార యంత్రాంగం అవసరమైన మార్పులు చేసి ఫైనల్ ఆన్సర్ కీని రిలీజ్ చేస్తుంది. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి.
జనవరి 2 నుంచి 20 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగనుంది. ఈసారి టీజీ టెట్‌కు దాదాపు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు ఉండేవి. 1 నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్ I, 6వ తరగతి నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్ II ఆప్షన్ ఎంచుకుంటారు.
టీఎస్ టెట్ ఆన్సర్ కీ 2025 డౌన్లోడ్ చేయడం ఎలా? :
- అధికారిక వెబ్సైట్ (tgtet2024.aptonline.in)ను విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో ఇచ్చిన “ప్రొవిజనల్ ఆన్సర్ కీ” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ చేయండి.
- ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసి, జాగ్రత్తగా చెక్ చేయండి.
టీఎస్ టెట్ ఆన్సర్ కీ 2025 ఉత్తీర్ణత మార్కులు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఉత్తీర్ణత 40 శాతంగా ఉండాలి.
టీచర్ ఉద్యోగాల భర్తీలో టెట్ పరీక్షలో సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై ప్రతి ఏడాదిలో టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో టీఎస్ టెట్ సర్టిఫికేషన్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉండగా ఇప్పుడు లైఫ్ టైమ్ ఉంటుంది.
Read Also : Restaurant industry : దేవుడా.. జొమాటో, స్విగ్గీ ఇంత పనిచేస్తుందా? నేషనల్ వైడ్ భారీ దెబ్బ పడనుందా?