Ttd Recruitment 2023 : టీటీడీలో ఉద్యోగాలు… లక్షన్నర జీతం.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు.

TTD Jobs
Ttd Recruitment 2023 : తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో పలు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)10 ఖాళీలు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)19 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుకు నవంబర్ 23 ఆఖరు గడువు తేదిగా నిర్ణయించారు.
READ ALSO : Telangana Voter List : తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. 80ఏళ్లు దాటిన ఓటర్లు ఎంతమంది అంటే?
ఖాళీలు ;
మొత్తం ఖాళీలు 56
పోస్టుల వివరాలు ;
ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు,
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు,
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు
READ ALSO : Balakrishna : జనసేనానిపై బాలయ్య ఇంట్రస్టింగ్ కామెంట్స్
అర్హతలు;
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం ;
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం ;
ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు, ఏఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు , ఏటీవో పోస్టులకు నెలకు రూ. 37,640 నుంచి రూ. 1,15,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : బీజేపీకి రాజీనామా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి రాములమ్మ
దరఖాస్తు గడువు ;
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 23వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ttd-recruitment.aptonline.in పరిశీలించగలరు.