Scholarships : తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.. ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్ కోసం ఇలా చేయండి
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్ధినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాదికి రూ.25వేలు, అవసరం ఉంటే ఇంకా ఎక్కువ ..

Uppalapati Ratna Manikyamba Memorial Scholarship
Uppalapati Ratna Manikyamba Memorial Scholarship : విద్యలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినప్పటికీ పైచదువులకోసం సరిపడా డబ్బులేక అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలిచి వారు ఉన్నత చదువులు అభ్యసించేలా పలు సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఏడాది కొంతమేర స్కాలర్ షిప్ అందిస్తూ విద్యార్థుల ఎదుగుదలకు ప్రోత్సాహంగా నిలుస్తున్నాయి. వాటిల్లో ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థునులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.
Also Read : Jobs in AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 10వరకు ఛాన్స్..
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్ధినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాదికి రూ.25వేలు, అవసరం ఉంటే ఇంకా ఎక్కువ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని సంస్థ ప్రకటించింది. అర్హులైన విద్యార్ధినులు అప్లయ్ చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు సూచించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్ధినుల ఆర్థిక అవసరాన్ని గుర్తించి.. స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ సంస్థ వివరించింది.
పూర్తి వివరాలు ఇలా..
◊ ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ స్కాలర్ షిప్
◊ సంవత్సరానికి రూ.25వేలు లేదా అంతకంటే ఎక్కువ.
◊ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి.
◊ బీఈడీ చదువుతున్న విద్యార్థునులు అర్హులు.
◊ ఇంటర్ లో కనీసం 75శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
◊ దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండాలి.
◊ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత విద్యార్థినులను ఎంపిక చేస్తారు.
◊ ఎంపిక చేసిన విద్యార్ధినులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తరువాత స్కాలర్ షిప్ అందిస్తారు.
◊ అర్హత కలిగినవారు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 30 సెప్టెంబర్ 2024 చివరి తేదీ.
◊ https://impactisglobal.com/s/ums00yd24 వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
◊ పూర్తి వివరాల కోసం సంస్థ ప్రతినిధి ఫోన్ నంబర్ 9051064904కు కాల్ చేయొచ్చు. లేదా shrestha.ganguly@impactisglobal.com ఐడీలో సంప్రదించవచ్చు.