Jobs in AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 10వరకు ఛాన్స్..
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Teachers (Google Image)
AP KGBV Teacher jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 604 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024-25 విద్యా సంవత్సరం ఏడాది కాలానికి బోధన, బోధనేత సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీల్లో ఖాళీగా ఉ్న బోధనా సిబ్బందిని కాంట్రాక్ట్ బేసిస్, బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.
పోస్టులు ఇలా..
మొత్తం 604 పోస్టుల్లో ప్రిన్సిపల్ పోస్టులు 10, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు – 165, సీఆర్టీ పోస్టులు – 163, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులు – 4, పార్ట్ టైం టీచర్ (పీటీటీ) పోస్టులు – 165, వార్డెన్ పోస్టులు – 53, అకౌంటెంట్ పోస్టులు-44 ఉన్నాయి.
దరఖాస్తు గడువు తేదీలు..
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం, ధరఖాస్తుచేసుకోవడానికి https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ చూడొచ్చు.
ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
వయో పరిమితి ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో సడలింపు ఉంటుంది.