UPSC Recruitment : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్న యూపీఎస్సీ

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నిర్ణీత విద్యార్హతలు, అలాగే మనకు గతంలో ఉన్న పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మాస్టర్/గ్రాడ్యుయేట్‌తో సహా నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

UPSC Recruitment : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్న యూపీఎస్సీ

UPSC Recruitment

Updated On : July 27, 2023 / 11:05 AM IST

UPSC Recruitment : ఓఆర్‌ఏ పద్ధతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కమిషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మైన్స్ మినిస్ట్రీ వంటి వివిధ మంత్రిత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : CCIL Recruitment : కాటన్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నిర్ణీత విద్యార్హతలు, అలాగే మనకు గతంలో ఉన్న పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మాస్టర్/గ్రాడ్యుయేట్‌తో సహా నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఖాళీల వివరాలకు సంబంధించి ఏరోనాటికల్ ఆఫీసర్ 26, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II 20, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ 1, సైంటిస్ట్ ‘బి’ 7, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ 2 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO :Positive Parenting Tips : మీ పిల్లలతో అనుబంధం పెంచే 10 సూత్రాలు

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 22, 2023 కాగా ఆగస్టు 10, 2023 తేది దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://upsconline.nic.in/ పరిశీలించగలరు.