CCIL Recruitment : కాటన్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్‌ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

CCIL Recruitment : కాటన్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీ

CCIL Recruitment

Updated On : July 27, 2023 / 9:55 AM IST

CCIL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Men’s Health : మగవాళ్లూ… ఈ టెస్టులు మరువకండి

మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)6, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఖాతాలు)6, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 81 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో MBA, CA, CMA, MBA , MMS, M.Com, PG, B.Sc పూర్తి చేసి ఉండాలి.

READ ALSO : Green Gram Varieties : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్‌ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Siri Hanumanthu : హాట్ హాట్ ఫోజులతో సిరి హన్మంతు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 13, 2023 ను చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cotcorp.org.in/ పరిశీలించగలరు.