Nin : హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పీజీ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి.

Nin Jobs
Nin : ఐసీఎంఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పీజీ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. నెట్ అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సారాల మధ్య ఉండాలి. ఆసక్తి గల అభ్యర్ధులు ఏప్రిల్ 22, 2022న జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 15, 800 రూపాయల నుండి 44, 450 వరకు వేతనంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.nin.res.in/ పరిశీలించగలరు.