Vacancies in Indian Navy : ఇండియన్‌ నేవీలో పోస్టుల భర్తీ

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Vacancies in Indian Navy : ఇండియన్‌ నేవీలో పోస్టుల భర్తీ

Indian Navy Recruitment

Updated On : May 18, 2023 / 1:02 PM IST

Vacancies in Indian Navy : ఇండియన్‌ నేవీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇండియన్‌ నావల్‌ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

అయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారుదరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, వెపన్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ తదితర విభాగాల్లో ఈ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ ముంబయి, హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్  శాఖపట్నం, హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి, హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ పోర్ట్ బ్లెయిర్ యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా మే 29, 2023వ తేదీని నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://indiannavy.cbexams.com/ పరిశీలించగలరు.