SBI Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

SBI Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in State Bank of India

Updated On : March 5, 2023 / 1:40 PM IST

SBI Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : Posts In Singareni : సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు ముంబయి, ఎస్‌బీఐఎల్‌, కోల్‌కతాలో పనిచేయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.