Posts In Singareni : సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఈఈ పూర్తి చేసి ఉండాలి. 3 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పోస్టులకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

Posts In Singareni : సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

Posts In Singareni :

Updated On : March 5, 2023 / 1:21 PM IST

Posts In Singareni : సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులతోనే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ &ఎం) 24, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 04, వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ 11, ప్రోగ్రామర్ ట్రైనీ 04, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ &ఎం) 14, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) 04, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 199, జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ 20, ఫిట్టర్ ట్రైనీ 114, ఎలక్ట్రీషియన్ ట్రైనీ 22, వెల్డర్ ట్రైనీ 43 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Goat And Sheep Farming : వ్యాపార సరళిలో జీవాల పెంపకంతో మెరుగైన జీవనోపాధి !

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఈఈ పూర్తి చేసి ఉండాలి. 3 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పోస్టులకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వీటికి ఎలాంటి వయోపరిమితి వర్తించదు.

రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అలాగే దరఖాస్తు హార్డ్‌కాపీలకు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు జతచేసి వారివారి విభాగాలకు మార్చి 16లోగా సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://scclmines.com/ పరిశీలించగలరు.