NIT Warangal Recruitment : వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు ఉద్యోగాల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్‌డీ(సివిల్), ఎంటెక్(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ జియోటెక్నికల్ ఇంజినీరింగ్/ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్)ను ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూను సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిట్ వరంగల్ లో నిర్వహిస్తారు.

Various Vacancies in National Institute of Technology, Warangal
NIT Warangal Recruitment : వరంగల్‌లోని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అడ్హక్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్‌డీ(సివిల్), ఎంటెక్(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ జియోటెక్నికల్ ఇంజినీరింగ్/ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్)ను ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూను సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిట్ వరంగల్ లో నిర్వహిస్తారు.
దరఖాస్తులను 8 జనవరి 2023 తేదీన సాయంత్రం 5 గంటల లోపు పంపాల్సి ఉంటుంది. షార్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను 10 జనవరి2023 తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూలను 18 జనవరి2023లో నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://nitw.ac.in/ పరిశీలించగలరు.