వెస్ట్రన్ రైల్వేలో 3,553 అప్రెంటిస్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 05:47 AM IST
వెస్ట్రన్ రైల్వేలో 3,553 అప్రెంటిస్ పోస్టులు

Updated On : January 7, 2020 / 5:47 AM IST

వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 3వేల 553 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, రిఫ్రిజిరేటర్ మెకానిక్  వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు : అభ్యర్దులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికా చేస్తారు. ఎంపికైన అభ్యర్దులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్దులకు రూ.18 వేల నుంచి రూ. 56,900 వరకు జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 7,2020. 
దరఖాస్తు చివరి తేది : ఫిబ్రవరి 6, 2020.