Owaisi to Amit Shah: గోద్రా ఘటనపై స్పందించిన అమిత్ షా.. గట్టిగా కౌంటర్ అటాక్ చేసిన ఓవైసీ

అమిత్ షా.. మీరు చెప్పే ఏ విషయాల్ని మేము గుర్తు పెట్టుకోవాలి. గోద్రా అల్లర్లు సృష్టించినవారికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పామని అంటున్నారు. కానీ బిల్కిస్‭ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. మూడేళ్లుగా ఆ బాధితురాలికి న్యాయం జరగలేదు. ఆ నేరస్థులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నేరస్థులందరికీ శిక్ష పడితే కదా అసలైన శాంతి నెలకొంటుంది

Owaisi to Amit Shah: గోద్రా ఘటనపై స్పందించిన అమిత్ షా.. గట్టిగా కౌంటర్ అటాక్ చేసిన ఓవైసీ

Asaduddin Owaisi lashes out at home minister Amit Shah for 'taught a lesson in 2002' remark

Updated On : November 26, 2022 / 7:15 PM IST

Owaisi to Amit Shah: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. జోరుగా సాగుతోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. పాత, కొత్త అంశాలను లేవనెత్తుతూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇందులో భాగంగా 2002 గోద్రాలో జరిగిన ఉదంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి లేవనెత్తారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ నిందితులందరికీ తగిన బుద్ధి చెప్పామని అన్నారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, ఎలాంటి దాడులు, దారుణాలు లేవని అన్నారు.

Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాక్.. ‘జైన ఫుడ్’ ఇచ్చేందుకు నిరాకరణ

అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గట్టిగానే బదులిచ్చారు. బిల్కిన్ బానో నిందితుల విడుదలను ప్రస్తావిస్తూ, ఇదేనా శాంతిభద్రతలు అంటూ అమిత్ షాను సూటిగా ప్రశ్నించారు.. మొదటిసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోన్న ఓవైసీ, శనివారం రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అమిత్ షా.. మీరు చెప్పే ఏ విషయాల్ని మేము గుర్తు పెట్టుకోవాలి. గోద్రా అల్లర్లు సృష్టించినవారికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పామని అంటున్నారు. కానీ బిల్కిస్‭ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. మూడేళ్లుగా ఆ బాధితురాలికి న్యాయం జరగలేదు. ఆ నేరస్థులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నేరస్థులందరికీ శిక్ష పడితే కదా అసలైన శాంతి నెలకొంటుంది’’ అని అన్నారు.

ఇక బీజేపీ అధికారం గురించి ఓవైసీ మాట్లాడుతూ ‘‘అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు. ఏదో ఒక రోజు ఇప్పుడున్న వారు అధికారం నుంచి తప్పుకుంటారు. వేరే ఇంకెవరైనా వస్తారు. బహుశా అధికారంలో ఉన్నామనే భావనతో అమిత్ షా ఇలా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. మొదట 14 స్థానాల్లో పోటీకి దిగినప్పటికీ, ఒక అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

DCW: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. దేశానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్