DCW: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. దేశానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల సమావేశం ప్రారంభమైంది. దాంతో మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు.

DCW: మహిళలను ఉద్దేశించి యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆయన క్షమాపణ చెప్పాలంటూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఢిల్లీ మహిళా కమిషన్ అధినేత స్వాతి మలివాల్ సైతం స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వాతి మలివాల్ స్పందిస్తూ ‘‘మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య ఎదుటే మహిళలను ఉద్దేశిస్తూ రాందేవ్ చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం చాలా బాధపడింది. కాబట్టి, దేశానికి రాందేవ్ క్షమాపణలు చెప్పాలి’’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాందేబ్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాక్.. ‘జైన ఫుడ్’ ఇచ్చేందుకు నిరాకరణ
మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల సమావేశం ప్రారంభమైంది. దాంతో మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు. దీనిపై రాందేవ్ స్పందిస్తూ.. ‘‘మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్ లో కూడా బాగుంటారు. నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం పదేళ్లు వచ్చే వరకు బట్టలే వేసుకోలేదు’’ అని బాబా రాందేవ్ అన్నారు. బాబా రాందేవ్ ఇంత పచ్చిగా మాట్లాడింది మహిళల సమావేశంలో. అదీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సమక్షంలో కావడం గమనార్హం. థానేలో ఈ సందర్భంగా బాబా రాందేవ్ మహిళల వస్త్రధారణను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.