By Polls: బీజేపీ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా?: మునుగోడు విజయం అనంతరం కేటీఆర్
ఈసీకి టీఆరెస్ ఫిర్యాదు చేస్తే ప్రేక్షక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగొడులోనే డబ్బులు అనే ప్రస్తావన వచ్చింది. ఈటెల రాజేందర్, రాజగోపాల్ ఇద్దరు ధనవంతులు కాబట్టే ఎన్నిక డబ్బుమయం అయిందనే అభిప్రాయం వచ్చింది. ఏ ఎన్నికలో లేని డబ్బు.. హుజురాబాద్, మునుగొడులో ఎందుకు వచ్చింది? ఓటమిని అంగీకరించే దమ్ము ఉండాలి. బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి.

KTR pressmeet after munugode by poll results
By Polls: మునుగోడు అసంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పాల్గొనడంపై బీజేపీ విమర్శలను కేటీఆర్ తిప్పి కొట్టారు. కొర్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానమంత్రి పాల్గొంటే తప్పులేదు కానీ, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో మంత్రులు పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మనుగోడు ప్రజలకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపులో పనిచేసిన టీఆరెస్ ప్రతీ కార్యకర్తలకు, నాయకులకు సైతం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘డబ్బుమదంతో, అహంకారంతో మునుగోడు ప్రజలపై ఉప ఎన్నికను రుద్దారు. రాజగోపాల్ ముందు కనిపించినా వెనుక ఉండి అమిత్ షా, మోడీ నడిపించారు. 9 రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చింది బీజేపీనే. వాస్తవానికి టీఆరెస్ పార్టీకి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉంది. మునుగొడులో వందల కోట్ల రూపాయలు మునుగొడుకు ఢిల్లీ నుంచి బీజేపీ తరలించింది.
ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవ్వగానే కోటి రూపాయలతో బీజేపీ నేత దొరికారు. ఈటెల రాజేందర్ పీఏ 90 లక్షల రూపాయలతో దొరికారు. 2 కోట్ల రూపాయలు గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి దొరికింది నిజం కాదా? 75 కోట్ల రూపాయలు వివేక్ కంపెనీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా? జమున హచరిచ్ సంస్థకు వివేక్ 25కోట్లు పంపింది నిజం కాదా? కోమటిరెడ్డి కొడుకు సంస్థ డబ్బులు పంపింది నిజం కాదా? అధికార దుర్వినియోగాయానికి బీజేపీ పాల్పడింది. 15కంపెనీల సీఆర్పీఎఫ్ పోలీసులు, 40 ఐటి టీమ్స్ మునుగోడుకు కేంద్రం పంపింది.
ఈసీకి టీఆరెస్ ఫిర్యాదు చేస్తే ప్రేక్షక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగొడులోనే డబ్బులు అనే ప్రస్తావన వచ్చింది. ఈటెల రాజేందర్, రాజగోపాల్ ఇద్దరు ధనవంతులు కాబట్టే ఎన్నిక డబ్బుమయం అయిందనే అభిప్రాయం వచ్చింది. ఏ ఎన్నికలో లేని డబ్బు.. హుజురాబాద్, మునుగొడులో ఎందుకు వచ్చింది? ఓటమిని అంగీకరించే దమ్ము ఉండాలి. బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కిన పార్టీ బీజేపీ. టీఆరెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. 9 శాతం ఓటింగ్ పెరిగింది.
రోడ్ రోలర్ గుర్తును ఎన్నికల కమిషన్ గతంలో తొలిగించి మళ్ళీ తెచ్చింది. ఆ రెండు గుర్తుల వల్ల 6 వేల ఓట్ల మెజారిటీ తగ్గింది. టీఆరెస్ పార్టీ ఓట్లను చీల్చే ప్రయత్నం బీజేపీ చేసింది. గెలుపుకు పాంగిపోయే ఓటమికి కుంగిపోయే అలవాటు మాకు లేదు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి సానుభూతి డ్రామాలు చేసింది బీజేపీ. పగలంతా ఈటెల రాజేందర్, రాత్రిపూట బండి సంజయ్ డ్రామాలు ఆడారు. డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను బీజేపీ పెట్టింది. ఫెక్ ప్రచారాం అనేది బీజేపీకి ఒక ఆర్ట్ అయింది’’ అని కేటీఆర్ అన్నారు.
By Polls: మూడు స్థానాల్లో గెలిచిన భార్యలు, మొత్తం నాలుగు స్థానాల్లో మహిళల గెలుపు