By Polls: మూడు స్థానాల్లో గెలిచిన భార్యలు, మొత్తం నాలుగు స్థానాల్లో మహిళల గెలుపు

మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రమేష్ లాక్టే మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఆయన భార్య రుతుజ లాక్టే పోటీ చేసి విజయం సాధించారు. బిహార్‭లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లోనూ భార్యలు గెలుపొందారు. మొకామా నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ భార్య నీలం దేవి విజయం సాధించారు

By Polls: మూడు స్థానాల్లో గెలిచిన భార్యలు, మొత్తం నాలుగు స్థానాల్లో మహిళల గెలుపు

wifes won in three seats and daughter one in by polls

By Polls: దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మహిళలు విజయం సాధించారు. ఇందులో మూడు స్థానాల్లో భార్యలే ఉండడం గమనార్హం. మహారాష్ట్రలోని ఒక స్థానం, బిహార్‭లోని రెండు స్థానాల్లో వీరు విజయం సాధించారు. ఇక హర్యానాలోని ఒక స్థానంలో కూతురు విజయం సాధించారు.

మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రమేష్ లాక్టే మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఆయన భార్య రుతుజ లాక్టే పోటీ చేసి విజయం సాధించారు. బిహార్‭లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లోనూ భార్యలు గెలుపొందారు. మొకామా నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ భార్య నీలం దేవి విజయం సాధించారు. ఆర్జేడీ తరపున పోటీ చేసి ఆమె గెలుపొందారు. ఇక గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత సుభాశ్ సింగ్ మరణంతో ఆయన భార్య కుసుమ దేవి పోటీకి దిగి విజయం సాధించారు.

వీరు ముగ్గురు కాకుండా.. హర్యానాలోని అదాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూతురు విజయం సాధించారు. కుల్దీప్ బిష్ణోయి రాజీనామాతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ ఉప ఎన్నికలో ఆయన కూతురు భవ్య బిష్ణోయి పోటీకి దిగారు. ఈ ఎన్నికలో ఆమె విజయం సాధించారు.

వాస్తవానికి మన దేశ రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంటుంది. గెలుపు మాట అటుంచితే టికెట్ల కేటాయింపు కూడా 20 శాతానికి దాటదు. అలాంటిది తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు నాలుగు స్థానాల్లో వారే విజయం సాధించడం గమనార్హం.

Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్