NOTA: రికార్డు స్థాయిలో ఓట్లు సాధించిన నోటా.. ఆ నియోజకవర్గంలో రెండో స్థానం

ఏదైనా ఎన్నికలో నోటా గెలిస్తే పరిస్థితి ఏంటనే అనుమానాలు ఇప్పటికే అనేకం ఉన్నాయి. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలనే దానిపై ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం లేదు. అయితే ఆ పరిస్థితి వస్తుందా అనే అనుమానాలే ఎక్కువ. కానీ, తాజా పరిస్థితి చూస్తే భవిష్యత్తులో నోటా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అనుమానాలు కలగక మానవు.

NOTA: రికార్డు స్థాయిలో ఓట్లు సాధించిన నోటా.. ఆ నియోజకవర్గంలో రెండో స్థానం

NOTA bags 14.8% vote share in Andheri East Assembly By Polls

Updated On : November 6, 2022 / 4:12 PM IST

NOTA: ఎన్నడూ లేని విధంగా నోటా అత్యధిక ఓట్లు సాధించింది. అత్యధికంగా అంటే అంతా ఇంతా కాదు, ఏకంగా రెండో స్థానంలో నిలవడం గమనార్హం. దేశంలో నోటా ప్రవేశ పెట్టిన అనంతరం.. ఒకటి రెండు చోట్ల 4 శాతం వరకు ఓట్లు సాధించిన నోటా తాజాగా 14.8 శాతం ఓట్లు సాధించడం గమనార్హం. ముంబైలోని తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో నోటాకు 12,806 ఓట్లు పడ్డాయి. ఈ స్థానంలో గెలుపొందిన అభ్యర్థి తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి.

వాస్తవానికి ఈ ఉప ఎన్నికలో సెంటిమెంట్ కారణంగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన మినహా ఏ ప్రధాన పార్టీ పోటీ చేయలేదు. అయితే ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అనుకున్నప్పటికీ.. రెండు చిన్న పార్టీలు, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడంతో పోలింగ్ అనివార్యమైంది. అయితే శివసేన, నోటా మినహా ఏ ఒక్కరూ 1500 ఓట్ల మార్కును దాటలేకపోయారు. మొత్తం 86570 ఉండగా.. శివసేనకు 66530 ఓట్లు, నోటాకు 12806 ఓట్లు వచ్చాయి.

దీంతో మొదటిసారి నోటా రన్నరప్‭గా నిలిచింది. ఏదైనా ఎన్నికలో నోటా గెలిస్తే పరిస్థితి ఏంటనే అనుమానాలు ఇప్పటికే అనేకం ఉన్నాయి. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలనే దానిపై ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం లేదు. అయితే ఆ పరిస్థితి వస్తుందా అనే అనుమానాలే ఎక్కువ. కానీ, తాజా పరిస్థితి చూస్తే భవిష్యత్తులో నోటా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అనుమానాలు కలగక మానవు.

By Polls: ఉప ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్.. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ పార్టీలదే విజయం