Pakistan: ప్రభుత్వానికి విపక్షానికి మధ్య కుదిరిన ఒప్పందం.. తొందరలో ఎన్నికలు!

ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సైతం చర్చలు జరిగాయి. ఈ విషయమై సంకీర్ణ ప్రభుత్వం, పీటీఐ మధ్య మూడో కీలక రౌండ్ టేబుల్ చర్చలు మంగళవారం రాత్రి చర్చించాయి. అయితే ఈ విషయంలో సైతం ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

Pakistan: ప్రభుత్వానికి విపక్షానికి మధ్య కుదిరిన ఒప్పందం.. తొందరలో ఎన్నికలు!

Updated On : May 3, 2023 / 6:20 PM IST

Pakistan: పాకిస్తాన్‭లో తొందరలోనే ఎన్నికలు జరిగేలా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీలు ఎన్నికల నిర్వహణకు పచ్చ జెండా ఊపాయి. ఆ దేశంలో ఇది చాలా పెద్ద పురోగతి. అయితే ఎన్నికల తేదీపై ఇరు వర్గాలకు ఇప్పటికీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాని మీద కూడా ఏకాభిప్రాయం వస్తే.. పాకిస్తాన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం.

Bajrang Dal: మేం కూడా బ్యాన్ చేస్తాం.. బజరంగ్ దళ్ సంస్థకు ఛత్తీస్‭గఢ్ సీఎం వార్నింగ్

పాకిస్తాన్‭లో ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఆ దేశాన్ని ఎన్నికల సమస్య కుదిపివేస్తోంది. విపక్ష నేతగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలను ఆయన డిమాండ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు తీస్తున్నారు. యాత్రలు చేస్తున్నారు. కాగా ఎట్టకేలకు అధికార, విపక్షాల మధ్య కొనసాగిన చర్చలతో ఎన్నికల అంశం ఒక కొలిక్కి వచ్చింది. దేశ ఎన్నికలతో పాటు జనవరిలో చేసిన పంజబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలోని ప్రభుత్వాలను రద్దు చేశారు. వీటికి సైతం ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు.

Maharashtra Politics: సుప్రియా సూలేనా లేదంటే అజిత్ పవరా? శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ బాస్ ఎవరు?

ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సైతం చర్చలు జరిగాయి. ఈ విషయమై సంకీర్ణ ప్రభుత్వం, పీటీఐ మధ్య మూడో కీలక రౌండ్ టేబుల్ చర్చలు మంగళవారం రాత్రి చర్చించాయి. అయితే ఈ విషయంలో సైతం ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. చివరగా ఎన్నికల తేదీపైనే చర్చలు సాగుతున్నాయి.

Karnataka Elections 2023: బీజేపీ ఉచిత పథకాల జపం దేనికి సంకేతం.. హస్తం పార్టీ ట్రాప్‌లో బీజేపీ చిక్కుకుందా?

ప్రభుత్వం వైపు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నుంచి ఇషాక్ దార్, ఖవాజా సాద్ రఫీక్, ఆజం నజీర్ తరార్, సర్దార్ అయాజ్ సాదిక్ పాల్గొనగా.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇతర పార్టీల నుంచి యూసుఫ్ రజా గిలానీ, సయ్యద్ నవీద్ కమర్ చర్చలకు హాజరయ్యారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పీటీఐ నుంచి వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫవాద్ చౌదరి, సెనేటర్ అలీ జాఫర్‌లను చర్చలకు హాజరయ్యారు.