Bajrang Dal: మేం కూడా బ్యాన్ చేస్తాం.. బజరంగ్ దళ్ సంస్థకు ఛత్తీస్‌గఢ్ సీఎం వార్నింగ్
పాకిస్థాన్‌కు చెందినవి భారత్‌కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.

Chhattisgarh CM Bhupesh Baghel
Bajrang Dal: విశ్వహిందూ పరిషత్ విద్యార్థి విభాగమైన బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా మంగళవారం విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. కాగా, ఈ వివాదం కర్ణాటకతోనే ఆగకుండా ఛత్తీస్‌గఢ్ వరకూ వెళ్లింది. అవసరమైతే తమ రాష్ట్రంలో కూడా బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంతమ్రి భూపేష్ బాఘేల్ అన్నారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ ‘బజరంగ్ భలీ’ని జైల్లో పెడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Bandi Sanjay: కేసీఆర్ నీకు ఢిల్లీలో ఏం పని..? ఏం కొంప మునుగుతుందని పోయావ్ ..
బ్యాన్ చేస్తామన్నది బజరంగ్ భలీని కాదని బజరంగ్ దళ్ సంస్థనని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ప్రధాని మోదీ నిష్ణాతుడని ఆయన విమర్శించారు. పాకిస్థాన్‌కు చెందినవి భారత్‌కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.
ఇక బజరంగ్ దళ్ సంస్థకు బాఘేల్ డైరెక్టు వార్నింగే ఇచ్చారు. ‘‘ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్దుతాం. కానీ అవి విపరీతానికి పోతే రద్దు చేస్తాం’’ అని అన్నారు. అలాగే రాష్ట్రంలో గొడవలకు పాల్పడవద్దంటూ రైట్ వింగ్ సంస్థలను హెచ్చరించారు. ‘‘బజరంగ్ భలి అందరికీ ఆరాధ్యదైవం. కానీ ఆ పేరుతో గూండాయిజాన్ని అనుమతించలేం. ఆ పేరుతో కొంతమంది గూండాలు గొడవలు, అల్లర్లకు పాల్పడుతున్నారు. నిజానికి అలాంటి సంస్థలకు బజరంగ్ భలి లాంటి పేర్లు ఉండడం కూడా సబబు కాదు’’ అని బాఘేల్ అన్నారు.