CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. అస్లాం అరెస్ట్

అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. అస్లాం అరెస్ట్

ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గురువారం ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే ఆ సభలో అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లు దొరికాయి. అనుమానస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.