ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై ముందడుగు

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పలు ప్రతిపాదనల్లో ఆప్షన్ జీకి ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది.