CM Revanth Reddy: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది : సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు పనిచేయకున్నా తెలంగాణలో దండిగా వరి సాగు అయిందని, రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Paddy Procurement: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు పనిచేయకున్నా తెలంగాణలో దండిగా వరి సాగు అయిందని, రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ లో 153 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయిందని, కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని రేవంత్ పేర్కొన్నారు.