ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులతో ఇరాన్ అటాక్

ఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. ఇజ్రాయిల్‌లోని జనావాస ప్రాంతాలనే లక్ష్యంగా తీసుకుని ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల దాడికి ఇజ్రాయిల్ విలవిల్లాడింది. ఇజ్రాయిల్‌లో బీర్ షేవ టెక్నో పార్క్ సమీపంలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహా అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీల కార్యాలయాల్లో మంటలు చెలరేగాయి. ఇరాన్ క్లస్టర్ బాంబును ప్రయోగించినది ఇదే తొలిసారి. ఇజ్రాయిల్‌లో భారీ విధ్వంసం సృష్టించిన క్లస్టర్ బాంబులను నిర్వీర్యం చేయడానికి ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.