60 యుద్ధ విమానాలతో ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు – 639 మంది మృతి?
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించింది. వరుసగా తొమ్మిదవ రోజు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజాగా 60 యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని లక్ష్యాలపై నిప్పులు చెరిగింది. అణు కార్యక్రమంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న "డిఫెన్స్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్" సంస్థ ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 639 మంది మరణించినట్లు సమాచారం.ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. తమపై దాడి చేసేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులు ఉపయోగించిందని టెల్ అవీవ్ వర్గాలు ఆరోపించాయి.