Israel Iran War: వార్‎ జోన్‎లో ఇండియన్ టెక్నాలజీ… స్మార్ట్‌గా వినియోగిస్తోన్నఇజ్రాయెల్

ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భారత్ రూపకల్పన చేసిన టెక్నాలజీని ఇజ్రాయెల్ స్మార్ట్‌గా వినియోగిస్తోంది. ఈ రోజు ఉదయం ఇరాన్ పంపిన ఎనిమిది డ్రోన్లను భారత్ తయారు చేసిన డిఫెన్స్ టెక్నాలజీని ఉపయోగించి అడ్డగించింది ఇజ్రాయెల్. ‘సీ షీల్డ్ టెక్నాలజీ’గా పిలిచే ఓ యాంటీ మిసైల్, డ్రోన్ అటాకింగ్ సిస్టమ్‌ను ఇజ్రాయెల్ భారత్‌తో కలిసి రూపొందించింది.

Israel Iran War: వార్‎ జోన్‎లో ఇండియన్ టెక్నాలజీ… స్మార్ట్‌గా వినియోగిస్తోన్నఇజ్రాయెల్

Updated On : June 18, 2025 / 5:15 PM IST

భీకరంగా సాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో, ఇజ్రాయెల్ వాడుతున్న ఓ టెక్నాలజీ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఎనిమిది ఇరాన్ డ్రోన్లను ‘బరాక్ మాగెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌’తో అడ్డుకుంది ఇజ్రాయెల్. దీంతో ఈ బరాక్ మాగెన్ టెక్నాలజీ అంటే ఏమిటనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

బరాక్ మాగెన్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసినది. వాయుమార్గంలో వచ్చే ఏవైనా ముప్పులను ఎదుర్కొనేలా ఈ వ్యవస్థ రూపొందించారు. ఈ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంతో కీలకం. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి