ఐటీ శాఖలో ఉద్యోగాలు.. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ, శాలరీ వివరాలు
అధికారిక వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19 2024.

Income Tax Department Jobs (Photo : Google)
Income Tax Department Jobs : మీరు స్పోర్ట్స్ పర్సనా? ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకో గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖలో ఉద్యోగాలు పడ్డాయి. మొత్తం 291 పోస్టులు ఉన్నాయి. ఈ కొలువులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సోర్ట్స్ పర్సన్స్ మాత్రమే అర్హులు. ముంబై బ్రాంచ్ లో కొలువులు భర్తీ చేస్తున్నారు. అధికారిక వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19 2024. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(టెన్త్ అర్హత), ట్యాక్స్ అసిస్టెంట్(డిగ్రీ అర్హత), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంటర్ అర్హత) తదితర పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు ఈ ఏడాది జనవరి 1 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి.
వెబ్ సైట్ – https://incometaxmumbai.gov.in/
పోస్టుల వివరాలు
ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్ – 14 పోస్టులు
స్టెనోగ్రాఫర్ – 18 పోస్టులు
ట్యాక్స్ అసిస్టెంట్ – 119 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 137 పోస్టులు
క్యాంటీన్ అటెండెంట్ – 3 పోస్టులు
* మెరిట్ బేస్ గా ఎంపిక.
* అథ్లెట్లకు ప్రాముఖ్యత.
* మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆధారంగా ఎంపిక.
* అప్లికేషన్ ఫీజు – 200 రూపాయలు
* ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. ఫీజు పేమెంట్ ప్రూఫ్ కూడా అప్లికేషన్ తో పాటు జత పరచాలి.
Also Read : త్రివిధ దళాల్లో 457 పోస్టులు.. అర్హతలు ఏంటి? జీతం ఎంత? పూర్తి వివరాలు
పోస్టులు – జీతాలు
Inspector of Income-tax (ITI): రూ. 44,900 – 1,42,400
Stenographer Grade-II (Steno): రూ. 25,500 – 81,100
Tax Assistant (TA): రూ. 25,500 – రూ. 81,100
Multi-Tasking Staff: రూ. 18,000 – రూ. 56,900
Canteen Attendant: రూ.18,000 – రూ.56,900
వయసు ఎంత ఉండాలి..
Inspector of Income-tax: 18-30 years
Stenographer Grade-II: 18-27 years
Tax Assistant: 18-27 years
Multi-Tasking Staff: 18-25 years
Canteen Attendant: 18-25 years
Also Read : కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ జిడ్డు వదలట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
విద్యార్హతలు..
Inspector of Income Tax (ITI): డిగ్రీ
Stenographer Grade II: 12వ తరగతి పాస్, లేదా తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి.
Tax Assistant (TA): డిగ్రీ
Multi-Tasking Staff (MIS): మెట్రిక్యులేషన్
Canteen Attendant (CA): మెట్రిక్యులేషన్