త్రివిధ దళాల్లో 457 పోస్టులు.. అర్హతలు ఏంటి? జీతం ఎంత? పూర్తి వివరాలు

అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్ సీ అఫీషియల్ వెబ్ సైట్(upsc.gov.in) ద్వారా అప్లయ్ చేసుకోవాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయి పరీక్ష.

త్రివిధ దళాల్లో 457 పోస్టులు.. అర్హతలు ఏంటి? జీతం ఎంత? పూర్తి వివరాలు

UPSC CDS 2024 Notification (Photo : Google)

Updated On : January 4, 2024 / 9:04 PM IST

UPSC CDS 2024 Notification : త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (CDSE) పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 9 వరకు అవకాశం ఉంది. డిగ్రీ, బీటెక్ చేసిన అర్హులు. మొత్తం 457 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు 56వేల 100 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 21 జరగనుంది.
వైబ్ సైట్.. upsc.gov.in

upsc cds ఎగ్జామ్ 2024 కోసం డిసెంబర్ 20 2023న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీడీఎస్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ను జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్ సీ అఫీషియల్ వెబ్ సైట్(upsc.gov.in) ద్వారా అప్లయ్ చేసుకోవాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయి పరీక్ష. యూపీఎస్ సీ ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను కండక్ట్ చేస్తుంది. త్రివిధ దళాలలో (ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ మిలటరీ అకాడెమీ, ఇండియన్ నేవల్ అకాడమీ) ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Also Read : పెదవుల ఆకారంలో ఉన్న ఈ మొక్క పేరేంటో తెలుసా?

* ఆన్ లైన్ లో పరీక్ష ఉంటుంది.
* పరీక్ష సమయం – రెండు గంటలు.
* పరీక్ష పేపర్ లాంగ్వేజ్ – ఇంగ్లీష్, హిందీ.
* అప్లికేషన్ ఫీజు – 200 రూపాయలు.
* అఫీషియల్ వెబ్ సైట్ – upsc.gov.in
* దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 9 2024.
* సీడీఎస్ 1 2024 పరీక్ష తేదీ – ఏప్రిల్ 21, 2024

Also Read : కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ జిడ్డు వదలట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

కోర్స్ – ఖాళీలు
ఇండియన్ మిలిటరీ అకాడమీ(డెహ్రాడూన్) – 100
ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల) – 32
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్ ) – 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై-మెన్) – 275
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై – ఉమెన్) – 18

* యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్ కు అర్హత గ్రాడ్యుయేషన్ డిగ్రీ
* నేవీ ఉద్యోగాలకు విద్యార్హత – ఇంజినీరింగ్ డిగ్రీ
* ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉద్యోగాలకు విద్యార్హత – క్లాస్ 12 పాస్ అయి ఉండాలి(ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు) దాంతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
* ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగాలకు వయసు 19 -23 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉద్యోగాలకు వయసు 19-24 ఏళ్ల మధ్య ఉండాలి.