Hookers Lips Plant : పెదవుల ఆకారంలో ఉన్న ఈ మొక్క పేరేంటో తెలుసా?
ప్రకృతిలో అరుదైన వృక్ష సంపద ఉంది. వాటిలో కొన్ని చూస్తే ఔరా అని ఆశ్చర్యపోతాం. ఎర్రటి పెదవుల ఆకారంలో ఉండే అరుదైన మొక్క గురించి మీకు తెలుసా?

Hookers Lips Plant
Hookers Lips Plant : పెదవులకు లిప్ స్టిక్ వేసుకున్నట్లు ఎర్రగా ఉన్న ఈ చెట్టు ఆకులు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సైకోట్రియా ఎలాటా లేదా.. హుకర్స్ లిప్స్ అని పిలిచే ఈ మొక్క ప్రత్యేకత ఏంటి? ఎక్కువగా ఏ ప్రాంతాల్లో జీవిస్తాయి? చదవండి.

Hookers Lips Plant 3
Marigold Flower : బంతిపూలు మొదట ఏ దేశంలో పూసాయో తెలుసా? వీటిలో ఎన్ని ఔషధ గుణాలంటే..
కోస్టారికా, ఈక్వెడార్, దక్షిణ అమెరికా దేశాల్లో మాత్రమే హుకర్స్ లిప్స్ మొక్కలు కనిపిస్తాయి సైకోట్రియా ఎలాటా లేదా హాట్ లిప్స్ ప్లాంట్.. లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్‌గా పిలబడే ఈ మొక్కలు ఈ భూమిపై ఉన్న వృక్ష జాతిలో అరుదైనవిగా చెప్పాలి. ఈ మొక్క ప్రత్యేకత బ్రాక్ట్స్ అని పిలవబడే దీని ఆకులు. ఎర్రటి పెదవుల ఆకారంలో ఇవి కనిపిస్తాయి. హమ్మింగ్ బర్డ్స్, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతుంది.

Hookers Lips Plant 4
ఈ మొక్క ఆకులు పువ్వులు పూయడానికి కొద్దిసేపు ముందు మాత్రమే పెదవుల ఆకారంలో కనిపిస్తాయి. దీని లోపలి నుండి నక్షత్రాల ఆకారంలో తెల్లని పువ్వులు వికసిస్తాయి. ఇవి అంతగా అట్రాక్టివ్‌గా అనిపించవు. సువాసనలు వెదజల్లే ఈ పూవులు డిసెంబర్, మార్చి నెలల్లో వికసిస్తాయట. మధ్య అమెరికాలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. వేలంటైన్స్ డే రోజు ప్రేమికులు ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. ఈ మొక్క బెరడు, ఆకులు చర్మ వ్యాధులతో సహా అనేక వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారట.
Gaddi Chamanthi : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే గడ్డిచామంతి? దీని ప్రయోజనాలు తెలిస్తే?
ప్రస్తుతం హుకర్స్ లిప్స్ మొక్క అంతరించేపోయే మొక్కల జాబితాలో ఉంది. అడవుల నరికివేత, వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. భవిష్యత్తు తరాలకు ఈ మొక్క గురించి తెలియాలంటే వీటి మనుగడ నశించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.