Gaddi Chamanthi : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే గడ్డిచామంతి? దీని ప్రయోజనాలు తెలిస్తే?
దెబ్బ తగిలిన వెంటనే రక్తం గడ్డ కట్టడానికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి గాయానికి కట్టు కట్టడం వల్ల రక్తం త్వరగా గడ్డ కడుతుంది. ఈ ఆకుల లో విటమిన్ కె సమృద్ధిగా ఉంది.

gaddi chamanthi health benefits
Gaddi Chamanthi : ప్రకృతిలో సహజ సిద్ధమైన మొక్కల్లో అనేక ఔషదగుణాలు ఉంటాయి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వీటిని ఉపయోగించవచ్చు. అలాంటి ఔషదగుణాలు కలిగిన గడ్డిజాతికి చెందిన మొక్కల్లో గడ్డి చామంతి కూడా ఒకటి. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది. గడ్డిచామంతి మొక్క ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. పొలాల గట్లపై, చెరువుల దగ్గర ఈ మొక్క మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది.
ఈ చెట్టు ఆకులలో యాంటీ కార్సినోజెనిక్ ఉన్నాయి. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఈ ఆకులను నమలడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు , గొంతు గరగర నుంచి వెంటనే ఉపశమనం కలిగించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి, జట్టురాలటాన్ని నివారించటానికి గడ్డి చామంతి ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఆకులు తీసుకుని శుభ్రం చేసుకుని ఆకులను మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ఆకుల పేస్ట్ను తగినంత ఆవనూనె పోసి నూనె మాత్రమే మిగిలి వరకు సన్నని మంట మీద మరిగించాలి ఈ ఆకుల నుంచి తయారుచేసుకున్న నూనెను ఒక గాజుసీసాలో కి వడకట్టుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది.
దెబ్బ తగిలిన వెంటనే రక్తం గడ్డ కట్టడానికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి గాయానికి కట్టు కట్టడం వల్ల రక్తం త్వరగా గడ్డ కడుతుంది. ఈ ఆకుల లో విటమిన్ కె సమృద్ధిగా ఉంది. అందుకే ఈ చెట్టు ఆకులు ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల నుంచి తీసిన రసం ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని తాగడం వలన కాలేయ సంబంధ వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా శ్వాసకోస సమస్యల నుండి బయట పడవచ్చు.