Marigold Flower : బంతిపూలు మొదట ఏ దేశంలో పూసాయో తెలుసా? వీటిలో ఎన్ని ఔషధ గుణాలంటే..

బంతిపూవులు చూడటానికి కళ్లను కట్టి పడేస్తాయి. రంగు రంగుల్లో విరబూసే ఈ పూలను చూస్తే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. బంతిపూల వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. అవేంటంటే..

Marigold Flower : బంతిపూలు మొదట ఏ దేశంలో పూసాయో తెలుసా?  వీటిలో ఎన్ని ఔషధ గుణాలంటే..

Marigold Flower

Marigold Flower : రంగురంగుల్లో పూసే బంతిపూలు (Marigold Flowers) కనువిందు చేస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పూవులు కనిపిస్తాయి. చాలా సులభంగా పెరిగే ఈ పూల మొక్కలు తక్కువ కీటకాలను కలిగి ఉంటాయి. ఔషధంగా వాడే బంతిపూలు అసలు ఏ దేశంలో మొదటగా విరబూసాయి? ఏ వ్యాధులకు దీనిని వాడతారు? తెలుసుకుందాం.

Cultivation Of Marigolds : కొబ్బరిలో అంతర పంటగా బంతిపూల సాగు

బంగారు వర్ణం, కుంకుమ వర్ణం ఇంకా పలు రంగుల్లో బంతిపూలు విరబూస్తుంటాయి. ఆహ్లాదం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా ఎరుపు రంగు పూవులు వినాయకుడికి ప్రీతికరమైనవని చెబుతారు. ఆ రంగు పూవులతో పూజలు చేస్తారు. పలు వేడుకల్లో బంతిపూవులను తోరణాలుగా కట్టి అలంకరణ చేస్తారు. బంతిపూలు మొదటగా ఈజిప్టులో పూసాయని రోమన్లు వీటిని మొదట బ్రిటన్ ఆ తరువాత ఇతర దేశాలకు పరిచయం చేసారని చెబుతారు. పురాతన గ్రీకులు బంతి పువ్వు రేకులను అలంకరణలు, మేకప్, కలరింగ్ ఫుడ్, ఔషధాల్లో వాడేవారట. వీటిలో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి?

కాలిన గాయాలు, దద్దుర్లు వంటి వాటికి చర్మ సమస్యల చికిత్సకు బంతిపూవుల నూనెను వాడతారట. బంతిపువ్వుల్లోని ఫ్లేవనాయిడ్స్ పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, మెలనోమా సమస్యలకు వాడతారట. ఇవి శరీరంలో ఉన్న చెడు పదార్ధాలను తొలగిస్తాయట. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయట. ఆడవారిలో వచ్చే బహిష్టు నొప్పుల నుంచి బంతిపూవుల నూనె ఉపశమనం కలిగిస్తుందట. 2018 లో జరిగిన ఓ అధ్యయనంలో బంతిపూవులలో అధిక మొత్తంలో ఉన్న పాలిఫెనాల్స్ కారణంగా చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తుందట. ఈ మొక్క పువ్వులే కాదు ఆకులు, రెమ్మలు, పూల కాడల నుండి కూడా నూనెను తయారు చేస్తారట.

Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

బంతిపూల నూనెలో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా బంతి పూలు ఉపయోగపడతాయి. కాస్మెటిక్స్ తయారీలో వీటిది ప్రత్యేక స్ధానం. బంతిపూవుల వాసనకు దోమలు, కీటకాలు ఇంట్లోకి చేరవట. అందుకే బంతిపూవులు పూసే సీజన్లలో ఇంటి పెరట్లో పెంచుతుంటారు. ఈ పూవులతో తయారు చేసిన ఉత్పత్తులు వాడే ముందు  వైద్యుల సలహా, సూచనలు పాటించడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అలెర్జీలు ఉన్నవారు వీటిని వాడకపోవడం ఉత్తమం.