Kitchen Tips : కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ జిడ్డు వదలట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

ఇల్లు క్లీనింగ్ అంటే ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కిచెన్ క్లీనింగ్‌కి చాలా సమయం కూడా పడుతుంది. జిడ్డు, మరకలతో ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఈజీగా శుభ్రం చేయాలంటే ఈ టిప్స్ పాటించండి.

Kitchen Tips : కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ జిడ్డు వదలట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Kitchen Tips

Updated On : December 30, 2023 / 12:24 PM IST

Kitchen Tips : వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా జిడ్డు పట్టి క్లీన్ చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. మీ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను సులభంగా క్లీన్ చేయడానికి ఈ చిట్కాలను పాటించండి.

ఇంట్లో క్లీనింగ్ అనగానే కొందరికి స్ట్రెస్ బస్టర్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వంటింటి క్లీనింగ్ అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటివి క్లీన్ చేస్తున్నప్పుడు జిడ్డు, మరకలు వదిలించడం మరింత కష్టం అవుతుంది. ప్రతి ఇంట్లో వంటింట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. దానిని క్లీన్ చేయడానికి కొంతమంది ఎక్స్ పర్ట్స్‌ని పిలుస్తుంటారు. అలా కాకుండా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే దానిని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే?

Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు

ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కి ఎక్కువగా జిడ్డు పట్టి ఉంటుంది. దీనిని పోగొట్టాలంటే సుళువైన మార్గం వేడినీళ్లు, సబ్బు. వేడినీరు గ్రీజుని తొలగించడంలో సహాయపడుతుంది. సబ్బు శుభ్రపరిచే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఒక గిన్నెలో 1 కప్పు వేడి నీరు కొన్ని చుక్కల సబ్బు వేసుకుని ఒక క్లాత్‌తో ఫ్యాన్ పై రుద్దాలి. ఆ సమయంలో ఎలాంటి గాయాలు, ప్రమాదాలు జరగకుండా ఫ్యాన్ స్విచ్ ఆఫ్‌లో లేదా అన్ ప్లగ్ చేసి ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి.

బేకింగ్ సోడా కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీద ఉండే మరకల్ని సులభంగా పోగొడుతుంది. ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను కొద్ది మొత్తం నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి. ముందుగా ఫ్యాన్ పొడిగుడ్డతో క్లీన్ చేసాక ఈ మిశ్రమాన్ని ఫ్యాన్, బ్లేడ్‌ల మీద వేసి రుద్దాలి. తర్వాత పొడిగుడ్డతో క్లీన్ చేస్తే జిడ్డు మొత్తం మాయం అయిపోతుంది.

Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?

నిమరసం కూడా క్లీనింగ్ ఏజెంట్ లాగ పనిచేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో కొంచెం నిమ్మరసం , సబ్బు కలిపి ఆ మిశ్రమాన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కి రుద్దాలి. నిమ్మ తొక్కలను ఫ్యాన్ బ్లేడ్‌లపై వేసి రుద్దితే మొండి గ్రీజు, మరకలు పోతాయి. వెనిగర్ ఉపయోగించి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చును. నీటిలో వెనిగర్ వేసి తడి గుడ్డతో రుద్దితే బాగా పనిచేస్తుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొత్తదిలా మెరుస్తుంది. మీ జిడ్డు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను శుభ్రం చేయాలంటే ఈ సుళువైన వంటింటి చిట్కాలు పాటించండి.