Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పేది పొట్ట బాగుండటానికే. మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారం ఈ గోరువెచ్చని నీళ్లే. పొద్దున్నే తాగడం వల్ల మలవిసర్జనసాఫీగా సాగుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని పేగుల కదలికలు సరిగ్గా జరిగి, వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లిపోతాయి.

Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు

hotwater benefits

Hot Water : రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు ఒక లీటర్ వరకు తాగమని చెబుతుంటారు వైద్య నిపుణులు. దానివల్ల పొట్ట ఆరోగ్యం బాగుండటమే కాకుండా బరువు కూడా తగ్గవచ్చని చెబుతుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. మన ఆరోగ్యానికి అసలైన చిరునామా నీళ్లే. ఇక వాటిని గోరువెచ్చగా తాగితే, వచ్చే ప్రయోజనాలు ఎన్నో.

READ ALSO : Walking : మోకాలి నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చెయ్యెచ్చా ?

ఆరోగ్యంగా, ఫిట్‍గా ఉండాలంటే ప్రతీ రోజు తగినంత నీరు తప్పకుండా తాగాలి. నీటిని వేడి చేసి.. కాస్త చల్లార్చి గోరువెచ్చగా తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నీటిని కాచుకొని తాగడం చాలా మంచిది. బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చగా కన్నా ఇంకొంచె వేడిగా కూడా నీళ్లు తాగితే గొంతులో ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగుతూ ఉంటే క్రమంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా బ్యాలెన్స్ అవుతుంది.

పొట్ట శుభ్రం

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పేది పొట్ట బాగుండటానికే. మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారం ఈ గోరువెచ్చని నీళ్లే. పొద్దున్నే తాగడం వల్ల మలవిసర్జనసాఫీగా సాగుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని పేగుల కదలికలు సరిగ్గా జరిగి, వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లిపోతాయి. గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మరింత మెరుగ్గా ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.

READ ALSO : Look Younger : యంగ్ గా కనిపించడం కోసం.. అలవాట్లు కూడా కీలకమే !

మెరిసే చర్మం

చర్మ రంధ్రాలు మెరుగ్గా తెరుచుకోవడానికిగోరువెచ్చని నీరు ఉపయోగపడుతుంది. దీని ద్వారా చర్మంలో దాగి ఉన్న టాక్సిన్లు, మట్టి కణాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‍గా ఉంటుంది. త్వరగా పొడిబారదు. దీంతో ముఖ కాంతి కూడా మెరుగ్గా ఉంటుంది. వేడి నీరు తాగితే చర్మానికి రక్తప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం త్వరగా ముడుతలు పడకుండా కాపాడుతుంది.

హెయిర్ కేర్

గోరువెచ్చని నీరు తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. వేడినీరు తాగితే.. తల మీది చర్మానికి రక్తప్రసరణ బాగా అవుతుంది. దీని వల్ల శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.

READ ALSO : Liver Infections : హెపటైటిస్ నుంచి కాలేయాన్ని కాపాడుకుందాం

దంత ఆరోగ్యం

గోరువెచ్చని నీరు తాగితే దంతాలకు కూడా మేలు జరుగుతుంది. పంటి నొప్పి, సెన్సిటివిటీనిగోరువెచ్చని నీరు తగ్గిస్తుంది. చిగుళ్లలో రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. క్రిములను కూడా నివారిస్తుంది.

మెరుగైన నిద్ర

గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రాత్రి వేళ్లలో నాణ్యమైన నిద్ర పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే మంచిది.