5 ఏళ్ల నిరీక్షణకు తెర! తిరిగి ప్రారంభమైన కైలాస మానస సరోవర యాత్ర.. పూర్తి వివరాలు, కొత్త రూల్స్ ఇవే!
కోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా ఈ పవిత్ర యాత్ర నిలిచిపోయింది. ఇటీవల బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చలు సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో, యాత్రను తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమమైంది.