రప్ప రప్ప డైలాగ్ పై రాజకీయ రచ్చ – అసాంఘిక శక్తులను ఉపేక్షించము: పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపుతున్న పుష్ప సినిమా డైలాగ్ "రప్ప రప్ప"పై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ పర్యటనలో "రప్ప రప్ప... నరుకుతాం" అంటూ ప్రదర్శించిన ప్లకార్డులపై కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయని, నిజ జీవితంలో వాటిని అనుసరించడం ప్రజాస్వామ్యంలో సాధ్యపడదన్నారు. చట్టవిరుద్ధంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనంటూ మండిపడ్డారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి