Gold And Silver Prices Today : బంగారం కొనుగోలుదారులకు అలర్ట్.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold And Silver Prices Today : బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు గోల్డ్ ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

Gold And Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అలర్ట్.. నేడు గోల్డ్ ధరల్లో మార్పులు చేసుకున్నాయి.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.170 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,020 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,610 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,460కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,34,900 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
