Diabetes In Momen: మహిళలు జాగ్రత్త.. మీలో ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్టే.. ఒకసారి చెక్ చేసుకోండి.
Diabetes In Momen: మహిళలల్లో డయాబెటిస్ వల్ల శరీరంలో శక్తి తక్కువగా అనిపిస్తుంది. చిన్న పనులు చేసినా చాలా త్వరగా అలసటగా అనిపిస్తుంది.

5 main symptoms of diabetes in women
డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న దీర్ఘకాలిక వ్యాధి. ఇది పురుషులు, మహిళలను సమానంగా ప్రభావితం చేస్తుంది. అయితే మహిళల్లో ఈ వ్యాధి కొన్ని ప్రత్యేక లక్షణాలతో కనిపించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించి వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి షుగర్ సమస్య వల్ల మహిళల్లో కనిపించే 5 ప్రధానమైన లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.అతివేగంగా అలసటకు గురికావడం:
మహిళలల్లో డయాబెటిస్ వల్ల శరీరంలో శక్తి తక్కువగా అనిపిస్తుంది. చిన్న పనులు చేసినా చాలా త్వరగా అలసటగా అనిపిస్తుంది. శరీరంలో సరైన రీతిలో
గ్లూకోజ్ శోషించబడకపోవడం వల్ల జరుగుతుంది.
2.మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడం:
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. అప్పుడు అధిక చక్కెరను బయటకు పంపేందుకు ఎక్కువ మోతాదులో మూత్రాన్ని బయటకు పంపిస్తాయి. కాబట్టి ఎక్కువగా టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది. మహిళల్లో ఇది రాత్రిళ్లు ఎక్కువగా కనిపిస్తుంది.
3.ఇన్‌ఫెక్షన్లు తరచూ రావడం:
డయాబెటిస్ ఉన్న మహిళల్లో ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు వంటివి ఎక్కువగా వస్తాయి. ఇది గ్లూకోజ్ అధికంగా ఉండడం వల్ల బాక్టీరియా, ఫంగస్ అధికంగా పెరగడం వల్ల కలుగుతుంది.
4.చర్మ సమస్యలు:
డయాబెటిస్ ఉన్న మహిళల్లో చర్మం పొడిగా మారటం, ముడతలు పడటం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చర్మం నల్లగా మారటం, మెడ చుట్టూ, మోచేతుల దగ్గర నల్లగా మారడం వంటివి కనిపిస్తాయి.
5.పీరియడ్స్‌లో సమస్యలు:
ఇన్సులిన్ సమస్యలు హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల పీరియడ్స్ లో గరిష్ట స్రావం లేదా అసమాన్యంగా రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఈ లక్షణాలను గుర్తించగానే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, నియమిత డైట్, వ్యాయామం, రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.