Cauliflower Health Benefits : కాలీఫ్లవర్ తినటం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు! దీనిని ఎవరెవరు తినకూడదంటే?

కాలీఫ్లవర్ యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ , ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతుంది. క్యాలీఫ్లవర్‌లో ముఖ్యంగా గ్లూకోసినోలేట్‌లు ,ఐసోథియోసైనేట్‌లు అధికంగా ఉంటాయి

Cauliflower Health Benefits : కాలీఫ్లవర్ తినటం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు! దీనిని ఎవరెవరు తినకూడదంటే?

Cauliflower Health Benefits

Updated On : August 29, 2022 / 5:13 PM IST

Cauliflower Health Benefits : కాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ, ఇది పోషకాలకు మూలం. గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంది. బరువు తగ్గడానికి అనుకూలమైనది. కాలీఫ్లవర్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా 8 సైన్స్ ఆధారిత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1.పోషకాల నిలయం ; కాలీఫ్లవర్ ను పోషకాహార నిలయంగా చెప్పవచ్చు. కాలీఫ్లవర్‌లో క్యాలరీలు చాలా తక్కువ, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి, కాలీఫ్లవర్‌లో శరీరానికి కావాల్సిన విటమిన్ మరియు మినరల్‌లు ఉన్నాయి. కేలరీలు,ఫైబర్, విటమిన్ సి,కె, బి6, ఫోలేట్,పాంతోతేనిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం వంటివి ఉన్నాయి.

2.ఫైబర్ అధికం ; కాలీఫ్లవర్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక కప్పు కాలీఫ్లవర్‌లో 3 గ్రాముల ఫైబర్ ఉంది, ఇది మీ రోజువారీ అవసరాలలో 10% గా చెప్పవచ్చు. జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దీనిలోని ఫైబర్ పెంచుతుంది., ఇది వాపును తగ్గించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, డైవర్టికులిటిస్,ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణక్రియ పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ వంటి ఫైబర్-రిచ్ వెజిటేబుల్స్ అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలోని ఫైబర్ స్థూలకాయం నివారణలో ముఖ్యపాత్రను పోషిస్తుంది.

3.యాంటీఆక్సిడెంట్ల మంచి మూలం ; కాలీఫ్లవర్ యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ , ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతుంది. క్యాలీఫ్లవర్‌లో ముఖ్యంగా గ్లూకోసినోలేట్‌లు ,ఐసోథియోసైనేట్‌లు అధికంగా ఉంటాయి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసే యాంటీఆక్సిడెంట్‌లు ఇందులో ఉన్నాయి. దీనిలోని గ్లూకోసినోలేట్లు, ఐసోథియోసైనేట్‌లు పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ప్రత్యేకించి రక్షణ కల్పిస్తున్నట్లు అధ్యయానాల్లో తేలింది. కాలీఫ్లవర్‌లో కెరోటినాయిడ్ , ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులతో సహా అనేక ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలీఫ్లవర్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది.

4. బరువు తగ్గడంలో ; కాలీఫ్లవర్ బరువు తగ్గడానికి సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంది. మొదటిది, ఇది ఒక కప్పుకు 25 కేలరీలు మాత్రమే అంటే తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది, కాబట్టి మీరు బరువు పెరగకుండా చూసుకోవచ్చు. పిండి వంటి అధిక కేలరీల ఆహారాలకు ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. ఫైబర్ యొక్క మంచి మూలంగా కాలీఫ్లవర్ ఉండటంతో జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువ మోతాదులో తినకుండా చేస్తుంది. దీని వల్ల బరువు త్వరగా తగ్గటానికి అవకాశం ఉంటుంది. దీనిలోని అధిక నీరు బరువు తగ్గించటంలో సహాయకారిగా తోడ్పడుతుంది.

5. కోలిన్ అధికంగా ఉంటుంది ; కాలీఫ్లవర్‌లో కోలిన్ అధికంగా ఉంటుంది, ఇది చాలా మందికి లోపించిన ముఖ్యమైన పోషకం. ఒక కప్పు కాలీఫ్లవర్‌లో 45 mg కోలిన్ ఉంటుంది, శరీరంలో కోలిన్ అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. కణాలను కాపాడటంతోపాటు, DNA సంశ్లేషణ చేయడం, జీవక్రియకు మద్దతు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కోలిన్ మెదడు అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు అవసరమైన న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో కీలకం. కాలేయంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తగినంత కోలిన్ తీసుకోని వారికి చిత్తవైకల్యం, అల్జీమర్స్ , నరాల సంబంధిత రుగ్మతలతో పాటు కాలేయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆహారాలలో కోలిన్ ఉండదు. కాలీఫ్లవర్, బ్రోకలీతో పాటు, పోషకాల యొక్క ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో కొలిన్ లభిస్తుంది.

6. సల్ఫోరాఫేన్ సమృద్ధిగా ; కాలీఫ్లవర్‌లో సల్ఫోరాఫేన్ ఉంటుంది, ఇది విస్తృతంగా అధ్యయనం చేయబడిన యాంటీఆక్సిడెంట్. క్యాన్సర్ మరియు కణితి పెరుగుదలలో పాల్గొనే ఎంజైమ్‌లను నిరోధించడం ద్వారా క్యాన్సర్ అభివృద్ధిని అణిచివేసేందుకు సల్ఫోరాఫేన్ ప్రత్యేకంగా సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. దెబ్బతిన్న కణాలను నాశనం చేయడం ద్వారా సల్ఫోరాఫేన్ క్యాన్సర్ పెరుగుదలను ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధకలు నిర్ధారణకు వచ్చారు. సల్ఫోరాఫేన్ పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అత్యంత రక్షణగా తోడ్పడుతుంది. సల్ఫోరాఫేన్ అధిక రక్తపోటును తగ్గించడంలో , ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం నివారణలో, మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సల్ఫోరాఫేన్ కీలకపాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.

7. ధాన్యాలు, చిక్కుళ్ళ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ; ఆహారంలో ధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాన్ని భర్తీ చేయటానికి కాలీఫ్లవర్ తీసుకోవచ్చు. తక్కువ కార్బ్ డైట్‌లను తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యాలు , చిక్కుళ్ళు కంటే క్యాలీఫ్లవర్ కార్బోహైడ్రేట్లలో చాలా తక్కువగా ఉంటుంది. ఒక కప్పు కాలీఫ్లవర్‌లో 5 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అదే సమయంలో, ఒక కప్పు బియ్యంలో 45 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. కాలీఫ్లవర్ కంటే తొమ్మిది రెట్లు ఉంటాయి.

8. ఆహారంలో చేర్చుకోవడం సులభం ; కాలీఫ్లవర్ ను ఆహారంలో చేర్చడం కూడా చాలా సులభం. దీనిని పచ్చిగా కూడా తినవచ్చు. కాలీఫ్లవర్‌ను ఉడికించటంద్వారా, సూప్‌లు, సలాడ్‌లు, వంటి వంటకాలతో కలిపి తీసుకోవచ్చు. చాలా చౌకగా లభిస్తుంది.

అయితే క్యాలీఫ్లవర్ తీసుకోవడం కొందరి ఆరోగ్యానికి మంచిదికాదు. దీనిని తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్‌ను ఎక్కువ పరిమాణంలో తినకూడదు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, మూత్రపిండాల
థైరాయిడ్ సమస్య ఉన్నవారు దీనిని తీసుకోకపోవటమే ఉత్తమం.